- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల బహిష్కరణ చేసిన ఐదుగురు కుల పెద్దలు అరెస్ట్..!
దిశ, భిక్కనూరు : చట్టానికి విరుద్ధంగా గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించి జరిమానాలు విధిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎస్ఐ ఆంజనేయులు బుధవారం హెచ్చరించారు.

దిశ, భిక్కనూరు : చట్టానికి విరుద్ధంగా గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించి జరిమానాలు విధిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఎస్ఐ ఆంజనేయులు బుధవారం హెచ్చరించారు. ఎస్సై ఆంజనేయులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన దొడ్లే గౌరవ్వ ను మంత్రాలు చేస్తుందన్న నేపథ్యంతో అదే గ్రామానికి చెందిన కుల పెద్దలు ఆమెను కుల బహిష్కరణ చేసి, పంచాయతీ ఏర్పాటు చేసి రూ. 2 లక్షల 75 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే బలవంతంగా ఆమె వద్ద నుంచి రూ. 15వేలు డబ్బులు వసూల్ చేశారని, మిగతా డబ్బులు కట్టకపోయినా, ఈ విషయం ఎవరికైనా చెప్పిన చంపేస్తామని, అంతు చూస్తామని బెదిరించి, కుల బహిష్కరణ చేశారు. బాధితురాలు పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. కుల పెద్దలైన దొడ్లే రాజయ్య( జంగంపల్లి) బోడ పరశురాములు ( భిక్కనూరు ), బోడ పట్ల దేవయ్య ( జనగామ), ఉప్పల్వాయి రాజయ్య ( జంగంపల్లి), బొమ్మని పెద్ద పోచయ్య ( జంగంపల్లి) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు వివరించారు.






