డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురు అరెస్ట్.. రూ.50వేలు జరిమానా

by Ratna Kumari |

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురు అరెస్ట్ అయిన ఘ‌ట‌న ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురు అరెస్ట్.. రూ.50వేలు జరిమానా
X

దిశ, ఆర్మూర్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురు అరెస్ట్ అయిన ఘ‌ట‌న ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఆర్మూర్ SHO స‌త్య‌నారాయ‌ణ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆర్మూర్ మున్సిప‌ల్ ప‌ట్ట‌ణ కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన ఐదుగురిని కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా.. ఒక్కొక్క‌రికీ రూ.10వేల చొప్పున మొత్తం రూ.50వేలు జ‌రిమానా ను జేఎఫ్ సీఎం న్యాయ‌మూర్తి స‌ర‌ళ‌రాణి విధించిన‌ట్టు తెలిపారు. వాహ‌న‌దారులు మ‌ద్యం సేవించి వాహ‌నాల‌ను న‌డ‌ప‌వ‌ద్ద‌ని సూచించారు. మోటార్ వెహికిల్ నూత‌న చ‌ట్టం ప్ర‌కారం.. భారీగా జ‌రిమానా, జైలు శిక్ష విధించిన‌ట్టు తెలిపారు. వాహ‌నాల ధృవ‌ప‌త్రాల‌ను వెంట‌నే ఉంచుకోవాల‌ని సూచించారు.

Next Story