- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో సైబర్ నేరాలపై తొలి పీడీ యాక్ట్ కేసు నమోదు
దిశప్రతినిధి, నిజామాబాద్: ఉద్యోగాల పేరుతో ఎందరో అమాయకులను మోసం చేస్తూ, చట్టవ్యతిరేకంగా గ్యాంగును నడుపుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిపై

దిశప్రతినిధి, నిజామాబాద్: ఉద్యోగాల పేరుతో ఎందరో అమాయకులను మోసం చేస్తూ, చట్టవ్యతిరేకంగా గ్యాంగును నడుపుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిపై రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా నిజామాబాద్ లో ప్రివెంటివ్ డిటెన్షన్ (పి.డి) యాక్ట్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల సుచిత్ర ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన కోలనాటి నాగశివ(36) అనే యువకుడిపై పలువురు బాధితుల నుండి ఫిర్యాదుల రాగా, నాలుగు కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. ఈ మేరకు ఆయనకు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ మద్య కాలంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించి అక్కడ సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేస్తున్న కోలనాటి శివ అనే నిందితుడిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. సైబర్ నేరాలు చేయిస్తున్న నిందితుడు యువతకు మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు చెల్లిస్తామని నమ్మబలికి వారిని లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపించేవాడని, అక్కడకు వెళ్లిన తర్వాత వారి పాస్ పోర్టులు స్వాధీనం చేసుకుని చట్ట విరుద్దమైన సైబర్ మోసాలకు పాల్పడేలా వారిచేత బలవంతంగా పని చేయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కోలనాటి నాగశివ ప్రధాన నిందితుడని సీపీ తెలిపారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాల కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు. గ్యాంగుకు ప్రధాన సూత్ర దారుడైన కోలనాటి నాగశివ పై సెప్టెంబర్ 13, 2025 రోజున పీడీ యాక్టు-1986 తెలంగాణ ( ప్రివెన్షన్ డిటెన్షన్ ) ను ప్రయోగించి నిందితుడిని చంచల్ గూడా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నుండి జారీ చేసిన ప్రివెన్షన్ డిటెన్షన్ (పి.డి) ఆర్డర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్ఫర్మేషన్ చేస్తుందని సీపీ తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు
నిజామాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారెవరైనా, ఎంతటి వారైనా తమ పద్ధతులను మార్చుకోవాలని హెచ్చరించారు. సమాజంలో మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్ వంటి నేరాలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారెవరైనా తమ పద్దతులను మార్చుకోవాలన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహారించే వారి సమాచారాన్ని ప్రజలు సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని సీపీ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో నేరస్థుల వివరాలను వెలికితీయాలని అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సమాజంలోని ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని, సమాజ శాంతికి భంగం కలిగించే వారి కదలికలపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాంటి వారిని కూడా పీడీ యాక్టు చట్టం క్రిందికి తీసుకురావడం జరుగుతుందని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.






