బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ఆపరేషన్ గది

by Mahesh |
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన ఆపరేషన్ గది
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి. కొన్ని రోజులుగా ఆస్పత్రిలోని పాత ఆపరేషన్ థియేటర్ మూసివేశారు. తెలంగాణ దశాబ్ది వారోత్సవాల సందర్భంగా గురువారం గదిని శుభ్రం చేయడానికి సిబ్బంది వెళ్లి, గదిలో ఉన్న ఏసీని ఆన్ చేయడం తో ఒకేసారి ఏసీలో నుంచి మంటలు వ్యాపించాయి. ఆపరేషన్ థియేటర్ గది అంతా మంటలు అంటుకొని కాలిపోయింది. హుటాహుటిన సిబ్బంది విద్యుత్ కనెక్షన్ నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై స్థానిక ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ ప్రసాద్‌ను వివరణ కోరగా ఆపరేషన్ థియేటర్లో నిరుపయోగంగా పడి ఉన్న ఏసీ నుంచి మంటలు వచ్చి గది పూర్తిగా కాలిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని సూపర్డెంట్ వెల్లడించారు.



Next Story

Most Viewed