​ రాజశ్రీ కోళ్ల పెంపకంతో గిరిజన కుటుంబాలల్లో ఆర్థిక స్వావలంబన

by Ratna Kumari |   (  Updated:2026-01-08 11:06:21  IST  )

గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా ఎదగడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసిందని జిల్లా పశువైద్యాధికారి డా. శ్రీనివాస్ అన్నారు.

​ రాజశ్రీ కోళ్ల పెంపకంతో గిరిజన కుటుంబాలల్లో ఆర్థిక స్వావలంబన
X

దిశ, తాడ్వాయి(​లింగంపేట): గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజనులు ఆర్థికంగా ఎదగడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసిందని జిల్లా పశువైద్యాధికారి డా. శ్రీనివాస్ అన్నారు. గురువారం లింగంపేట మండలంలోని బాలాపూర్ తండా, జగదాంబ తండా గిరిజనులకు భారత పరిశోధన మండలి (ఐసీఆర్) - ట్రైబల్ సబ్ ప్లాన్ ఆర్థిక సహకారంతో రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా పశువైద్య అధికారి డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాణిజ్యపరంగా కోళ్ల ఫారాలు పెట్టాలంటే భారీ వ్యయం అవుతుందని.. రాజశ్రీ కోళ్లు ఇంటి పరిసరాల్లో దొరికే వడ్లు, జొన్నలు, తౌడు, పురుగులను ఆహారంగా తీసుకుని పెరుగుతాయి. ఎటువంటి పెట్టుబడి లేకుండానే గిరిజనులకు ఇవి మంచి లాభాలను తెచ్చిపెడతాయి అని వివరించారు. గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయ వనరుగా కోళ్ల పెంపకం, గ్రామీణ ప్రజలకు చౌకగా కోడిగుడ్లు, మాంసం అందుబాటులోకి తీసుకురావడం, పెరటి కోళ్ల పెంపకం ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఆదాయం పొందవచ్చాన్నారు. అనంతరం డా. దేశ కృష్ణ మాట్లాడుతూ...రాజశ్రీ కోళ్లు అధిక గుడ్ల ఉత్పత్తిని ఇస్తాయని,వీటి ద్వారా గిరిజనులు స్వయం ఉపాధి పొందవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజల్లో సమతుల్య ఆహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.​ ఈ కార్యక్రమంలో పశువైద్య నిపుణులు డా. అనిల్ పవన్ కుమార్,డా. రవి,డా. హనా జోన్స్,ఏలేటి రాజు, స‌ర్పంచ్, ఉప స‌ర్పంచ్ లు పాల్గొన్నారు.

Next Story