ఐదో విడత సాగునీటి విడుదల

by Ratna Kumari |

ఆయకట్టు కింద సాగు చేస్తున్న రబీ(యాసంగి) పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని విడుదలను శుక్రవారం ప్రారంభించినట్లు నీటిపారుద శాఖ ఏఈ సాకేత్ తెలిపారు.

ఐదో విడత సాగునీటి విడుదల
X

దిశ, నిజాంసాగర్ : ఆయకట్టు కింద సాగు చేస్తున్న రబీ(యాసంగి) పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని విడుదలను శుక్రవారం ప్రారంభించినట్లు నీటిపారుద శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న లక్ష 25 వేల ఎకరాలకు ఐదో విడతలో 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నామని, ఇప్పటి వరకు నాలుగో విడుదల్లో 10.7 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. చివరి ఆయకట్టు పంటలు చాలా వరకు చేతికి అందడంతో ప్రస్తుతం ఐదో విడత నీటిని డిస్ట్రిబ్యూటర్ ఒకటి నుంచి 39 వరకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు నీటిని వృధా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1399.03 అడుగులు10.338 టీఎంసీలు వద్ద ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత రబీ (యాసంగి) పంటల సాగుకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. కాలువల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నీటి ప్రవాహం వేగంగా ఉండే అవకాశం ఉన్నందున ఎవరు కాల్వలోకి దిగకూడదని, కాలువ కాలువ ఒడ్డుల సమీపానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను కూడా కాలువల దగ్గరకు తీసుకురాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా నీటిపారుదల శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

Next Story