- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొడుకు చేతిలో తండ్రి హతం! ఎందుకో తెలిస్తే..

దిశ, ధర్పల్లి: వృద్ధుడిని కొడుకు, కోడలు కలిసి హతమార్చిన అమానుష ఘటన ధర్పల్లి మండల పరిధిలోని ఓన్నాజీపేట్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నడిపి మల్లయ్య (65) కొడుకు మధు, కోడలు లక్ష్మితో పాటు కలిసి ఉంటున్నాడు. అయితే, తరచు మల్లయ్య, మధు గొడవలు పెట్టుకునే వారు. శనివారం రాత్రి కూడా ఓ కిరణా షాపు ఎదుట డబ్బులు ఇవ్వాలంటూ తండ్రితో మధు వాగ్వాదానికి దిగాడు. దీంతో అక్కడున్న వారు ఇద్దరిని మందలించగా.. సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి రాత్రి 10 గంటల ప్రాంతంలో మల్లయ్యతో మళ్లీ గొవడకు దిగిన కోడుకు, కోడలు అవేశంలో ఆయనను బలంగా తోసేసి బీరు సీసాతో బలంగా తలపై కొట్టారు. దీంతో మల్లయ్యకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అంనంతరం నిందితులు మధు, లక్ష్మిని రిమాండ్‌కు పంపినట్లుగా సీఐ భిక్షపతి వెల్లడించారు.