- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వము ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేసి రైతులను ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పంట నష్టపోయిన రైతులకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలి
-ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్
-నాగిరెడ్డిపేటలో రైతుల రాస్తారోకో
దిశ, నాగిరెడ్డిపేట్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వము ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేసి రైతులను ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగిరెడ్డి పేట్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై మండలంలోని మంజీరా నది పరిహాహక ప్రాంత గ్రామాలైన పోచారం, మాల్ తుమ్మెద, గోలి లింగాల్, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, బంజారా తాండ, లింగంపల్లి, తాండూర్, వెంకంపల్లి, మాటూర్, మాసానిపల్లి, ఆత్మకూర్, జలాల్ పూర్, ఎర్రారం తదితర గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా, రాస్తారోకో కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులకు మద్దతుగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి రైతులకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని, ప్రభుత్వం నష్ట పోయిన పంటలకు ఎకరానికి 50 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మంజీరా నది వరదతో పాటు, నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంటలు నీట మునిగి రైతులకు భారీగా నష్టం వాటిల్లితుందని ప్రభుత్వం 21 రోజులు గడిచిన ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు గండ్లు పడిపంట పొలాల్లో రాళ్లు, ఇసుక, మట్టి పేరుకుపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం అందజేస్తామని సరైన ప్రకటన చేయలేదని, పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందజేయాలని, అలాగే మంజీరా నది పరివాహక ప్రాంత గ్రామాలలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తో ముంపుకు గురవుతున్న భూములకు ప్రభుత్వం శాశ్వత నష్టపరిహారంగా ఎకరాకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోనే అత్యధికంగా పంటలు నీట మునిగి నష్టపోయాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం విహార యాత్ర లాగా వచ్చి లింగంపేట మండలంలో పర్యటించి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పంజాబ్ రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వం ఎకరాకు 30 వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించిందని, పంజాబ్ కంటే ముందుగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసి ప్రజలతో పంటలు నష్టపోయాయని, పంటలు నష్టపోయి నెలరోజులు దగ్గర పడుతున్న ప్రభుత్వం రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
అమెరికాలో ఉంటున్న ఎమ్మెల్యే ప్రజల కష్టాలు తెలుస్తలేవని ఇక్కడ ఉన్న వాళ్ళతో సమాచారం తీసుకుని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ తో పాటు, వర్షాలు, వరదలతో పంట పొలాల్లో నీటిమట్టం రోజురోజుకు పెరుగుతుందని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయించి 24 గంటల్లో నీటిని ఖాళీ చేయించానని, ప్రస్తుత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఒక్కరోజు మాత్రమే నీటిని వదిలే విధంగా చూసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. రైతులకు ప్రత్యక్ష హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుండి కదిలేది లేదంటూ రైతులు మొండికేయడంతో స్థానిక పోలీసులు, అధికారులు ధర్నా వద్దకు చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆర్డీవో రావాలంటూ నినాదాలు చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారథి రెడ్డితో చరవాణిలో మాట్లాడించారు.
ముంపునకు గురైన రైతుల పంటల వివరాలు నమోదు చేశామని ప్రభుత్వానికి నివేదిస్తున్నామని అందరికీ నష్టపరిహారం అందేలా రెవెన్యూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి నివేదిక తయారు చేస్తున్నామని అలాగే నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ను తొలగించేందుకు ప్రాజెక్టు నుండి అదనంగా మరి కొన్ని గేట్లు తెరిపించేందుకు కలెక్టర్ తో మాట్లాడతానని రైతులు ఆందోళన విరమించాలని కోరడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుండి తమకు స్పష్టమైన హామీ రాకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని మండల రైతులు హెచ్చరించారు. అనంతరం తహశీల్దార్ శ్రీనివాసరావు కు వినతి పత్రాన్ని అందజేశారు. రాస్తారోకో సందర్భంగా అల్లర్లు జరగకుండా సదాశివనగర్ సిఐ సంతోష్ కుమార్, స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్, ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్, లింగంపేట ఎస్సై దీపక్ కుమార్, 40 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు బొల్లు నర్సింహా రెడ్డి, మాజీ ఎంపీపీ దివిటి రాజ్ దాస్, మాజీ జెడ్పిటిసిలు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి, జయరాజ్, నాయకులు గుర్రాల సిద్దయ్య, రాజారెడ్డి, దుర్గారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ యాదయ్య, కాంతా రెడ్డి, యాదగిరి, నాగేశ్వర్ రెడ్డి, నరేష్, రామకృష్ణ, వివిధ గ్రామాల రైతులు, పాల్గొన్నారు.






