- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూరియా యాప్‌ను రద్దు చేయాలని రైతుల రాస్తారోకో..
రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

దిశ, నందిపేట: నందిపేట మండల కేంద్రంలో సోమవారం రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. నిరక్షరాస్యులైన అన్నదాతలకు అన్యాయం జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు. వివేకానంద చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా నిరసనలు చేస్తామని ప్రకటించారు. అసైన్మెంట్ భూముల్లో సాగు చేసే రైతులకు, సామాన్య, చిన్న, సన్న రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డిని డౌన్ డౌన్ అంటూ..
సీఎం రేవంత్ రెడ్డి దొరల రాజ్యానికి మద్దతు ఇచ్చేలా యూరియా యాప్ ను అమల్లోకి తెచ్చారని విమర్శించారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నామరూపాలు లేకుండా పోతాయని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిని డౌన్ డౌన్ అంటూ ఘాటుగా విమర్శించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా కేంద్రం నుంచి, నవీపేట నుంచి వచ్చే వాహనదారులకు అసౌకర్యం ఏర్పడింది. ఘటనా స్థలానికి ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాంబాబు వచ్చి రైతులతో మాట్లాడారు . యాప్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ విట్టల్ రావు, బిజెపి కిషన్ మోర్చా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, ఎర్రం ముత్యం, కస్ప రామకృష్ణ, నందిపేట గ్రామ సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు.






