రైతులు కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-29 09:15:42  IST  )

రైతులు కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేష్ సూచించారు.

రైతులు కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, నిజాంపేట : రైతులు కొనుగోలు కేంద్రాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అద‌న‌పు క‌లెక్ట‌ర్ న‌గేష్ సూచించారు. బుధ‌వారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప‌రిశీలించి నిర్వాహ‌కుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం 2027 తొలి విడ‌త జ‌న గ‌ణ‌న‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ తప్పులు లేకుండా జనగణన నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ.. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోదని సూచించారు. తహశీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ రమ్య శ్రీ, రెవెన్యూ ఇన్ స్పెక్ట‌ర్ ప్రీతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story