- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి
by Ratna Kumari |
దిశ, గాంధారి : మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన

X
దిశ, గాంధారి : మొక్కజొన్న, సోయా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని మార్క్ ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గాంధారి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న, సోయా పంటల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలోని సిబ్బంది పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్ లను అందుబాటులో ఉంచాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి కి సూచించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ ఎగ్జిక్యూటివ్ చందు, సొసైటీ కార్యదర్శి గాండ్ల సాయిలు, ఎ.ఇ.ఓ. నిఖిత, ఎన్.సి.సి.ఎఫ్. సర్వేయర్లు మహేందర్, సాయి, రైతులు పాల్గొన్నారు.
Next Story






