రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్ట‌ర్

by Ratna Kumari |

దిశ, గాంధారి : మండలంలోని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గాంధారి పాక్స్ చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ అన్నారు. మండలంలోని పోతంగల్ క

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు :  డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్ట‌ర్
X

దిశ, గాంధారి : మండలంలోని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గాంధారి పాక్స్ చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ అన్నారు. మండలంలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు అధైర్య పడొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పోతంగల్ కలాన్ మాజీ సర్పంచ్ బాలరాజు, పాక్స్ డైరెక్టర్లు గాండ్ల లక్ష్మణ్, ఆర్ల శివాజీ, గోవింద్ గణపతి, సొసైటీ సీఈవో గాండ్ల సాయిలు, పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Next Story