- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొసైటీల ముందు రైతులు క్యూ
by Ratna Kumari |
దిశ, భిక్కనూరు : సొసైటీలకు యూరియా బస్తాల లోడ్ లారీలు వచ్చాయని తెలిసి.. రైతులు వేకువ జాము నుంచే క్యూలో నిల్చొని గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. కామారెడ్డి

X
దిశ, భిక్కనూరు : సొసైటీలకు యూరియా బస్తాల లోడ్ లారీలు వచ్చాయని తెలిసి.. రైతులు వేకువ జాము నుంచే క్యూలో నిల్చొని గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి, భిక్కనూరు సొసైటీల వద్ద బుధవారం యూరియా కోసం బారులు తీరారు. జంగంపల్లి సొసైటీ 670, భిక్కనూరు సొసైటీకి 670 బస్తాల చొప్పున రెండు డీసీఎం వ్యాన్ లోడ్ల యూరియా వచ్చిందని తెలిసి క్యూ కట్టారు. ఎకరాకు ఒకటి రెండు చొప్పున క్యూలో నిల్చున్న రైతులందరికీ యూరియాను పంపిణీ చేశారు. యూరియా కోసం గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా సొసైటీల వద్ద పోలీసులను మోహరించారు. యూరియా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినప్పటికీ ఆ ప్రక్రియ ఇంకా అమల్లోకి రాలేదని చెబుతున్నారు.
Next Story






