- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Electric Shock : కరెంట్ షాక్ తో రైతు మృతి..
పొలానికి... నీరు పారబెట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది.

దిశ, భిక్కనూరు : పొలానికి... నీరు పారబెట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మట్టె స్వామి రెడ్డి (37) ముందు రోజు రాత్రి పొద్దు పోయాక నీళ్లు పారబెట్టి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళాడు.
వెళ్లిన మనిషి ఇంటికి తిరిగి రాకపోవడంతో అక్కడ ఇక్కడ వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా, స్టార్టర్ డబ్బాలో ఫ్యూజులు కటింగ్ పేరుతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు సర్వీస్ వైర్ నుంచి కరెంట్ షాక్ తగిలి డబ్బా పక్కనే పడి మృతి చెందాడు. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి లింగారెడ్డి ఫిర్యాదు మేరకు భిక్కనూరు ఎస్సై సాయికుమార్ కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.






