ఎమ్మెల్యే పై అసత్య ప్రచా రాలు మానుకో వాలి

by Ratna Kumari |

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై బీఆర్ఎస్ కు చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం చేస్తున్నాడని, అసత్య ప్రచారాలను మానుకొని అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే పై అసత్య ప్రచా రాలు మానుకో వాలి
X
దిశ‌, లింగంపేట : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై బీఆర్ఎస్ కు చెందిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారం చేస్తున్నాడని, అసత్య ప్రచారాలను మానుకొని అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్ల సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గొల్ల సాయిరాం యాదవ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ తన ఐదేళ్ల పదవీకాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రెండున్నర ఏళ్ల వ్యవధిలో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని ఆయన అన్నారు. గత ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు మండలంలోని కన్నాపూర్, లింగంపల్లి గ్రామాల చెరువులు వరద ఉధృతికి కొట్టుకుపో యా యని అన్నారు. కొట్టుక పోయిన చెరువుల మర మతు పనులు చేసేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నిధులు మంజూరు చేయించాడని, వారం పది రోజుల్లో పనులు ప్రారంభ మవుతాయని ఆయన చెప్పారు.

కేవలం రాజకీయ లబ్ధి కోసమేమాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కన్నా పూర్ చెరువులో బీఆర్ఎస్ నాయకులతో, కొంత మంది రైతులతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై అసత్య ఆరోపణలు చేశారని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేపడుతున్న అభివృ ద్ధి పనులను తెలుసుకొని మాట్లాడాలని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరిం చారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు వంజరి ఎల్లమయ్య మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రా వు అభివృద్ధిలో " సాఫ్ట్ వేర్ కాదని హార్డ్ వేర్ " అని అన్నారు. అభివృద్ధి పనుల కోసం తానే సరదాగా ప్రతిపాదనలు తయారు చేసుకొని సంబంధిత శాఖల ఉన్నతాధికారుల వద్దకు, మంత్రుల వద్దకు వెళ్లి పట్టుబట్టి మరి నిధులను మంజూరు చేయిస్తారని అన్నారు. రెండున్నర ఏళ్ల కాలంలో మదన్ అన్న చేసిన అభివృద్ధి పనులను ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదని అన్నా రు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతూ నిధులు రాబడుతున్న ఘనత మదన్మోహన్ రావుకే దక్కుతుందని ఆయన అన్నారు.అలాంటి ఎమ్మె ల్యేపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాజ కీయ లబ్ధికోసం ఎమ్మెల్యే ను విమర్శించడం తగదని ఆయన అన్నారు.

చెరువు తూము మరమ్మతుల కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గత ఏడాది రూ.30 లక్షలు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. కొట్టుకపోయిన చెరువు కట్టల మరమ్మ తుల కోసం ఇటీవలనే నిధులు మంజూర య్యా యని మరో 10 రోజుల్లో పనులు ప్రారంభ మైతా యని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నాయ‌కులు నియోజకవర్గ అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇస్తే స్వాగతిస్తామని, విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన చెప్పారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బుర్ర నార గౌడ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీ యుద్దీన్,ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు సక్రూ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి అబ్దుల్ వాహబ్, శేవ్య నాయక్, లింగంపేట సర్పంచ్ కౌడ రవి, ఉప సర్పంచ్ ప్రసాద్ గౌడ్ , మండలంలో ని ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story