- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎగ్జంషన్ ఉన్న బండికి టోల్ కట్ అవుతుందా..?
ఎగ్జంషన్ ఉన్న బండికి టోల్ కట్ అవుతదా.... ఎవడ్రా కట్ చేసినోడు లం... కొడుకు అంటూ కారును టోల్ బూత్ వద్దనే ఆపేసి యజమాని ఒకరు హల్ చల్ చేసిన ఘటన బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది.

దిశ, భిక్కనూరు : ఎగ్జంషన్ ఉన్న బండికి టోల్ కట్ అవుతదా.... ఎవడ్రా కట్ చేసినోడు అంటూ నానా బూతులు తిడుతూ.. కారును టోల్ బూత్ వద్దనే ఆపేసి యజమాని ఒకరు హల్ చల్ చేసిన ఘటన బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఒకరు కామారెడ్డి నుంచి తిప్పాపూర్ వెళ్తుండగా, సైడ్ ఎగ్జిట్ నుంచి పోకుండా, తన ఫస్ట్ ఎగ్జిట్ నుంచి వెళ్లడంతో టోల్ కట్ అయ్యింది. దీంతో కోపోద్రిక్తుడైన యజమాని ఎగ్జంషన్ ఉన్న వాహనానికి టోల్ ఎట్లా కట్ చేస్తారంటూ బూత్ లో కూర్చొని టోల్ వసూల్ చేస్తున్న సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యాడు. వెనకాలే వాహనాలు ఉండడం, హారన్ కొడుతున్నప్పటికీ ముందుకు వెళ్లకుండా, కారు బూత్ వద్దనే ఆపేసి, బయటకు దిగొచ్చి హల్ చల్ చేశాడు.
వాహనం అయితే అక్కడ నుంచి ముందుకు తీయాలని, వెనకాల ఉన్న ట్రాఫిక్ కు ఇబ్బంది అవుతుందని, ప్లాజా సిబ్బంది ఆయన వద్దకు చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, మీ వద్ద ఉన్న ఎగ్జంషన్ జాబితాలో ఈ బండి నెంబర్ ఉండగా, టోల్ ఎలా కట్ అవుతుందంటూ సిబ్బందితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో తిప్పాపూర్ గ్రామానికి చెందిన పలువురు వాహనాదారులు వచ్చి, మేము నిన్న రాత్రి ఫంక్షన్ కు వెళ్లి వస్తుంటే ఆధార్ కార్డు అడుగుతున్నాడని, లోకలని చెప్పినా వినిపించుకోకుండా టోల్ వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని వచ్చిన వారు కూడా కూడా ప్లాజా సిబ్బందిపై మండిపడ్డారు. సుమారు అరగంట పాటు రచ్చ రచ్చ చేసిన తరువాత, ఆయనకు ఎవరో ఫోన్ చేస్తే అప్పుడు ప్లాజా బూత్ నుంచి బయటకు తీశాడు.






