- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి అవగాహన కలిగి ఉండాలి
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ సూచించారు.

దిశ, కామారెడ్డి : ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు గాను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీవోలు, ఏపీవో లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పోలింగ్ రోజు ఎదురయ్యే వివిధ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు శిక్షణ లో భాగంగా ఎన్నికల అధికారులకు అవగాహన కల్పిస్తూ మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడేందుకు పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ లు కీలక పాత్ర పోషిస్తారని, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలో మొత్తం ప్రక్రియను సజావుగా నిర్వహించడం పీవో యొక్క ప్రధాన బాధ్యత అని అన్నారు. ఓటింగ్ ప్రారంభానికి ముందు పోలింగ్ సామగ్రి సక్రమంగా ఉందో లేదో పరిశీలించడం, మాక్ పోలింగ్ నిర్వహించడం, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం చేయడం వంటి బాధ్యతలు నిర్వహించాలని, ఓటర్ల గుర్తింపు, ఓటరు జాబితా ప్రకారం ఓటు హక్కు కల్పించడం, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం వీరి బాధ్యత అన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడటం, సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం కూడా వారి విధుల్లో భాగం అని, అలాగే పోలింగ్ ముగిసిన అనంతరం ఓటింగ్ యంత్రాలను సీల్ చేయడం, అవసరమైన పత్రాలను పూర్తిచేసి భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌కు తరలించడం వంటి కీలక బాధ్యతలను కూడా నిర్వర్తించాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం లో డీఈఓ రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.






