- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కేసును సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాలి
ప్రతి కేసులో నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందని ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

ప్రతి కేసును సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాలి
-డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి
-ప్రజలు శాంతియుత వాతావరణంలో దసరా, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి
-కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, రాజంపేట : ప్రతి కేసులో నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందని ఉందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం రాజంపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా రోల్ కాలనీ పరిశీలించి హాజరైన సిబ్బంది, గైర్హజరైనా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. క్రమశిక్షణ, నిబంధన పెంపొందించడంలో ఇది ఎంతో గాను ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి మండలంలోని అన్ని గ్రామాల సమాచారం, సస్పెక్ట్, రౌడీ షీటర్ల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీస్ వ్యవస్థ సాధ్యమవుతుందన్నారు. బ్లూ కోర్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పంద చర్యలపై వెంటనే స్పందించాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. విజిబుల్ పోలింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విపిఓలు తమకు కేటాయించిన గ్రామాలను తరచు సందర్శిస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగేలా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అందించారు. అదేవిధంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని రాజంపేట పోలీసులకు ఆదేశించారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో దసరా, నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ చైతన్య రెడ్డి,ఎస్సై రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.






