- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ విధంగా ఉపాధి కూలీ డబ్బులు చెల్లించాలి : కలెక్టర్
పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.

దిశ,తాడ్వాయి: పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలోని శ్రీ భీమేశ్వరాలయం సమీపంలోని చెక్ డ్యాం లోని పూడికతీత పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం క్రింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. గ్రామంలో 240 హౌస్ హోల్డ్స్ కి గాను 316 జాబ్ కార్డ్స్ ఉన్నాయనీ,280 యాక్టివ్ కూలీలు పనులకు హాజరవుతున్నారని తెలిపారు. దాదాపు ఒక వారం నుండి చేపడుతున్న పూడికతీత పనుల్లో కూలీలకు కూలీ చెల్లించడం లేదని,పోస్టాఫీస్ ద్వారా చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని కూలీలు కలెక్టర్ కు వివరించారు. పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా కూలీ చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభి వృద్ధి అధికారికి సూచించారు. అనంతరం శ్రీ భీమేశ్వరాలయం లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దేవాలయం పురాతన కాలం నాటిదని, పర్యాటకంగా అభివృద్ధి పరచాలని పూజారులు, గ్రామస్తులు కలెక్టర్ ను కోరారు. రోడ్డు సౌకర్యం,నీరు, టాయ్ లెట్స్ ఏర్పాటుచేయాలని కోరారు. అనంతరం గ్రామంలోని నర్సరీ ను పరిశీలించి,ఇంటింటికీ పంపిణీ చేసే విధంగా పండ్లు, పూల మొక్కలను పెంచాలని తెలిపారు.
అనంతరం పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ మొక్కలకు నీరు పోశారు. ప్రతీ రోజు మొక్కలకు నీరు పోయాలని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా గ్రామస్తులు ప్రమీల ఇంటికి భూమి పూజ చేసి,నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఆ తరువాత బ్రహ్మాజీవాడ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు వాటరింగ్ నిర్వహించారు. ఏవెన్యూ ప్లాంటేషన్ నిర్వహించాలని,గాప్ లలో కొత్త మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రాజారాం,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్,ఇన్చార్జి తహసీల్దార్ రేఖ,ఎంపీడీఓ సాజిద్,ఎంపీఓ సవిత రెడ్డి,పంచాయతీ కార్యదర్శి,గ్రామస్తులు, ఇతర మండల అధికారులు, పాల్గొన్నారు.






