పేద‌ల‌కు నూత‌న వ‌స్త్రాలు పంపిణీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, బాన్సువాడ : బీర్కూర్ కు చెందిన మున్నూరు కాపు సంఘ ఉద్యోగులు దసరా పండగ సందర్భంగా పేదలకు నూతన వస్త్రలు పంపిణీ చేశారు. ఈ

పేద‌ల‌కు నూత‌న వ‌స్త్రాలు పంపిణీ
X

దిశ, బాన్సువాడ : బీర్కూర్ కు చెందిన మున్నూరు కాపు సంఘ ఉద్యోగులు దసరా పండగ సందర్భంగా పేదలకు నూతన వస్త్రలు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మున్మూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్య‌క్షుడు మాట్లాడుతూ.. మున్నూరు కాపు అంటేనే ఉదార స్వభావం కలవారని సహాయం చేసే గుణం ఉన్న వారని తెలిపారు. ప్రతి ఏటా దసరా సందర్భంగా మున్నూరు కాపు నిరుపేదల కు బట్టల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంఠం అంబయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నారు. ఈ సంవత్సరం పదిమందికి నిరుపేదలకు నూతన వస్త్ర దారులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంఠం అంబయ్య, ఉపాధ్యక్షులు తెలుగు పట్ల శ్రీనివాస్, కార్యదర్శి మాల్ దొడ్డి విఠల్, ముఖ్య సహాదారులు మేకల విట్టల్, కోశాధికారి కంఠం శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఇంగు రాములు, ఉద్యోగ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Next Story