లస్ట్ స్టోరీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

by Bhanu |

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.

లస్ట్ స్టోరీ.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
X

దిశ, తాడ్వాయి (ఎల్లారెడ్డి): అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత భర్తను ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లింగారెడ్డి పేటకు చెందిన షేక్ హమ్మద్ (47) జనవరి 24వ అదృశ్యమయ్యాడని మృతుని భార్య ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఈ విచారణలో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.ఈ విచారణలో మృతుని భార్య పౌలవ్వ కురుమ సాయిలు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.దీంతో షేక్ మమ్మద్ అక్రమ సంబంధానికి పడుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించేందుకు పథకం వేసింది.దీంతో జనవరి 24న పూజ పేరుతో భర్తను నమ్మపలికి ఎల్లారెడ్డి అడవిలోని గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించారు.


మత్తులోకి జరుకోగానే భర్తను గొంతు నులిమి చంపేశారు.అనంతరం పురుషాంగాలు నలిపి శరీరంపై పెట్రోల్ పోసి కాల్చివేశారు.ఎవరికి అనుమానం రాకుండా మృతుడి భార్య పోలీస్ స్టేషన్కు వెళ్లి నా భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసి పోలీసులను తప్పుదోవ పట్టించింది.చరవాణిలో ఉన్న కాల్ రికార్డింగ్,లోకేషన్ ఆధారంగా పోలీసులు అత్య ఉదాంతాన్ని నిగ్గుతెల్చారు.మృతుడి భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని లోతుగా విచారించగా నేరం ఒప్పుకున్నారు.ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.నిందితులనుంచి 3 మొబైల్ ఫోన్లు ఒక tvs XL బండి,వెండి కడియం. స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును చేదించడంలో కృషిచేసిన సీఐ బి.రవీందర్ నాయక్,ఎస్సై బి మహేష్,కానిస్టేబుల్ అనిల్ సిద్దు ప్రసాద్ ఇద్రిస్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.


Next Story