తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మద్దతు

by Ratna Kumari |

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టీ) సవరణ బిల్లుపై ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు.

తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మద్దతు
X

దిశ, తాడ్వాయి : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్టీ) సవరణ బిల్లుపై ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సవరణ బిల్లు సామాన్య ప్రజలకు వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్నుల విధానంలో సరళత తీసుకురావడం వల్ల వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. ఆదాయ మార్గాలను మెరుగుపరుస్తూనే,ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహిస్తోందని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారదర్శకమైన పాలన అందిస్తోందని, ఈ బిల్లు అందులో ఒక భాగమేనని స్పష్టం చేశారు.​ తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి సంస్కరణలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story