ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు..

by Kodari Anjali |

సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదంగా మారాయి.

ప్రమాదకర స్థితిలో విద్యుత్ స్తంభాలు..
X

దిశ, సదాశివ నగర్: సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలోని వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభాలు వంగి ప్రమాదంగా మారాయి. గ్రామ రైతులకు, కూలీలకు, పశువులకు ప్రాణహానిగా మారాయి. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు సాధారణ ఎత్తులో కాకుండా కేవలం నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులోనే వేలాడుతూ ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామ ప్రజలు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. రైతులు ప్రతిరోజు పెట్టుకొని కులాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వ్యవసాయ భూములు మీదిగా వెళ్లే విద్యుత్ తీగలు కిందికి వంగిపోవడంతో ప్రస్తుతం అవి మనుషుల ఎత్తుకు సందర్భంగా మారాయని రైతులు చెబుతున్నారు.

గాలులు కారణంగా స్తంభాలు కూలిపోయే ప్రమాదం..

నేలకు అతి దగ్గరగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేసి సరైన ఎత్తుకు ఎత్తాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని, పాడైన తీగలను మార్చాలని, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాలు, బలమైన గాలులు కారణంగా స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పొలాలకు వెళ్లేందుకు భయంగా మారిందనిరైతులు తెలిపారు. ప్రమాదం జరగక ముందే మరవత్తులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.

Next Story