ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి

by Bhanu |

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కామారెడ్డిలో ఆదివారం చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వృద్ధురాలు మృతి
X

దిశ, కామారెడ్డి : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కామారెడ్డిలో ఆదివారం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన అనసూయ (60) అనారోగ్యంతో కామారెడ్డి ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆదివారం వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుని తిరుగుప్రయాణంలో భర్త, కోడలితో కలిసి ఎర్రపహాడ్​ వెళ్లేందుకు బస్సు ఎక్కింది. కాగా బస్సు కామారెడ్డి శివారులోని దేవునిపల్లి గ్రామానికి చేరుకోగానే అనసూయ ఛాతిలో నొప్పిగా ఉందంటూ పడిపోయింది. వెంటనే ఆమెను అంబులెన్స్​లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. కాగా మృతురాలికి ఇద్దరు కొడుకులు కాగా వారు విదేశాల్లో ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.




Next Story