నాగిరెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగిరెడ్డిపేట్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నాగిరెడ్డిపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బోధన్ -

నాగిరెడ్డిపేటలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
X

దిశ, నాగిరెడ్డిపేట్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నాగిరెడ్డిపేట మండల బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు. సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా భారతదేశ గౌరవాన్ని కించపరుస్తూ, దేశ సైనికుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి దేశ ప్రజలకు, భారత సైనికులకు క్షమాపణలు చెప్పే వరకు రేవంత్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల హన్మండ్లు, నరేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజాగౌడ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి రాజు, నాయకులు విష్ణు, గోపాల్, అనిల్ రెడ్డి, సిద్ధి రాములు, విజయ్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story