బాతులు మేపడానికి వచ్చి అనంత లోకాలకు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, నాగిరెడ్డిపేట్ : సుదూర ప్రాంతాల నుంచి బాతులు మేప‌డానికి వ‌చ్చి ప్ర‌మాద‌వ‌శాత్తూ విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో యువ‌కుడు అనంత‌లోకాల‌కు వెళ్లాడు. ఈ ఘటన

బాతులు మేపడానికి వచ్చి అనంత లోకాలకు
X

దిశ‌, నాగిరెడ్డిపేట్ : సుదూర ప్రాంతాల నుంచి బాతులు మేప‌డానికి వ‌చ్చి ప్ర‌మాద‌వ‌శాత్తూ విద్యుత్ షాక్ త‌గ‌ల‌డంతో యువ‌కుడు అనంత‌లోకాల‌కు వెళ్లాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు (16) తన తల్లిదండ్రులు సయ్యద్ ముంతాజ్, సయ్యద్ మహమ్మద్ భాష లతో పాటు, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి వర్షాకాలం ముగియడంతో తెలంగాణలోకి బాతులను మేపడానికి వస్తున్నాడు. అయితే ఈనెల 12న బయలుదేరి శుక్రవారం నాటికి నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగిరెడ్డి పేట గ్రామ శివారులోని వరి పంట కోతలు కోసిన పంట పొలాల్లో సయ్యద్ చోటు తమ బాతులను మేపుకుంటూ ఉండగా, కొన్ని బాతులు మందలో నుంచి ప్రక్కకు వెళ్లడంతో వాటిని మందలోకి కలిపే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఓ బోరుబావి వద్ద స్టార్టర్ బాక్స్ కు ఉన్న విద్యుత్ వైరు సయ్యద్ చోటు కాలుకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ తగిలి క్రింద పడిపోయాడు. వెంటనే సయ్యద్ చోటును తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం స్థానికుల సహాయంతో మండల కేంద్రంలోని జెఎస్ఎమ్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చోటు అప్పటికే మృతి చెందాడని వైద్యుడు ధ్రువీకరించినట్లు తెలిపారు. దీంతో మృతుని తల్లి సయ్యద్ ముంతాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Next Story