మహారాష్ట్ర ముఠా గుట్టును రట్టుచేసిన పోలీసులు

by Bhanu |

హిందువులు పవిత్ర దైవంగా భావించే గోవులకు కొందరు దుండగులు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి దొంగతనం చేస్తున్న ముఠాను జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు.

మహారాష్ట్ర ముఠా గుట్టును రట్టుచేసిన పోలీసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హిందువులు పవిత్ర దైవంగా భావించే గోవులకు కొందరు దుండగులు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి దొంగతనం చేస్తున్న ముఠాను జిల్లా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా గుర్తించి పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ముఠాలోని ఆరుగురు సభ్యులను పట్టుకుని దేగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు సీపీ వెల్లడించారు. సీపీ సాయిచైతన్య వెల్లడించిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి వాటిని ఇన్నోవా వెహికిల్ సహా ఇతర వాహనాల్లో దొంగతనంగా తరలించే ముఠాను పట్టుకోవడానికి నిజామాబాద్ సీపీ సాయిచైతన్య సీసీఎస్ అధికారులను ఆదేశించారు.


సీపీ ఆదేశాల ఉత్తర్వుల ప్రకారం నిజామాబాదు సీసీఎస్ ఇన్ స్పెక్టర్ సురేష్, తన సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్ లతో కలిసి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి దొంగతనంగా ఇతర ప్రాంతాలకు తరలించే ముఠాను పట్టుకోవడానికి మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లి రెండు రోజుల పాటు వారి గురించి గాలించారు. అట్టి ముఠా సభ్యులైన నాందేడ్ కు చెందిన సయ్యద్ ఉమర్, సయ్యద్ ఆమెర్, అబ్దుల్ కలాం, సయ్యద్ షోయబ్, ముంబైకి చెందిన సమీర్ అలీ ఖురేషీ, మహబూబ్ లనే ఆరుగురు నిందితులను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి వారు వాడుకుంటున్న ఇన్నోవా కారును ప్రెస్, పోలీస్ బోర్డులు తగిలించుకుని దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టుకుని తీసేసీన కారుని సీజ్ చేని తదుపరి చర్య నిమిత్తం దేగ్లూర్ పోలీసులకు అప్పగించినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు.

Next Story