ఆలూర్‌లో డ్రైనేజీ పనులకు శ్రీకారం

by Ratna Kumari |

ఆలూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధికి మరో ముందడుగు పడింది. 15వ ఆర్థిక సంఘ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు.

ఆలూర్‌లో డ్రైనేజీ పనులకు శ్రీకారం
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధికి మరో ముందడుగు పడింది. 15వ ఆర్థిక సంఘ నిధులతో రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఆలూర్ గ్రామ సర్పంచ్ ముక్కెర విజయ్ కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముక్కెర విజయ్ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి వంటి సదుపాయాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆలూర్ గ్రామంలో దశలవారీగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను కొనసాగిస్తామని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం అదనపు నిధులు సమీకరించేందుకు ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఉప సర్పంచ్ ఇలేటి పద్మ మోహన్, పంచాయతీ కార్యదర్శి ఉమా, వార్డు స‌భ్యులు ప్రవీణ్, భోజన్న, సాయిలు, రంజిత్, శిరీష, సంజీవ్, అనుప్రియ, భాస్కర్, నరేష్, లక్షపతి, మౌనిక, సునీల్, మహేష్, రమ్య, అఖిల్, మల్లేష్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు ములకిడి శ్రీనివాస్ రెడ్డి, నవనీత్, గంగారెడ్డి, చిరంజీవి, బీరయ్యతో పాటు గ్రామ పెద్దలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story