నీళ్ల కోసం రోడ్లెక్కిన డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిప‌ల్ ప‌రిధిలోని రెండో వార్డు రామేశ్వ‌ర‌ప‌ల్లి డ‌బుల్ బెడ్ రూం కాల‌నీవాసుల‌కు గ‌త నెల రోజులుగా తాగునీరు రావ‌డం లేద‌ని డ‌బుల్ బెడ్ రూమ్

నీళ్ల కోసం రోడ్లెక్కిన డబల్ బెడ్ రూమ్ కాలనీవాసులు
X

దిశ‌, కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిప‌ల్ ప‌రిధిలోని రెండో వార్డు రామేశ్వ‌ర‌ప‌ల్లి డ‌బుల్ బెడ్ రూం కాల‌నీవాసుల‌కు గ‌త నెల రోజులుగా తాగునీరు రావ‌డం లేద‌ని డ‌బుల్ బెడ్ రూమ్ వాసులు సిరిసిల్ల బైపాస్ రోడ్డు వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించారు. మున్సిపల్ డీఈ, ఏఈ రావాలని డబల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి ఎస్సై రంజిత్ పోలీసులు అక్కడ చేరుకొని డీఈ, ఏఈలను రప్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు. డీఈ హనుమంతరావుకు కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. డీఈ హనుమంతరావు మాట్లాడుతూ.. వారం రోజులలో నీటి సమస్యను పరిష్కరిస్తానని.. బోరులో మోటర్ పెట్టిపించి నీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మ‌హిళ‌లు ధ‌ర్నా విర‌మింపజేశారు.

Next Story