కంపెనీ పై అసత్య ప్రచారాలు చేయొద్దు

by Nallavelli.Anjaneyulu |

అన్ని రకాల అనుమతులతోనే ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడుతున్నామని, తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా అసత్య ప్రచారం చేయొద్దని ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మధు, టెక్నికల్ ఇంచార్జ్ లు డాక్టర్ రాజిరెడ్డి సదానందంలు విజ్ఞప్తి చేశారు.

కంపెనీ పై అసత్య ప్రచారాలు చేయొద్దు
X

దిశ, భిక్కనూరు : అన్ని రకాల అనుమతులతోనే ఫార్మా కంపెనీ నిర్మాణం చేపడుతున్నామని, తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా అసత్య ప్రచారం చేయొద్దని ఫార్మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ మధు, టెక్నికల్ ఇంచార్జ్ లు డాక్టర్ రాజిరెడ్డి సదానందంలు విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ 667 సర్వే నెంబర్ లో 2.5 ఎకరాల్లో ఈ కంపెనీ నిర్మాణం చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతోనే కంపెనీ నిర్మాణం చేపడుతుంటే.. కొంతమంది కావాలని దురుద్దేశంతో ఆధార రహితంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను భయాందోళనలను సృష్టించే విధంగా చేస్తున్నారని తెలిపారు. ఈ సంస్థ ప్రతిష్ట ను భంగం కలిగించే విధంగా చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చేయడం తగదన్నారు. కంపెనీ పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్ట ప్రకారం లీగల్ గా చర్య తీసుకుంటామన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలను ప్రచురించరాదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ చట్టబద్ధత కు అత్యంత ప్రాధాన్యతరిస్తామని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా పట్టణాభివృద్ధి కట్టుబడతామన్నారు.

Next Story