తాత్కాలిక ఆనందం కోసం విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు : సీఐ న‌ర‌హ‌రి

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : తాత్కాలిక ఆనందం కోసం విలువైన భ‌విష్య‌త్ ను నాశ‌నం చేసుకోవ‌ద్దు అని సీఐ న‌ర‌హ‌రి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

తాత్కాలిక ఆనందం కోసం విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు : సీఐ న‌ర‌హ‌రి
X

దిశ, కామారెడ్డి : తాత్కాలిక ఆనందం కోసం విలువైన భ‌విష్య‌త్ ను నాశ‌నం చేసుకోవ‌ద్దు అని సీఐ న‌ర‌హ‌రి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. తాజాగా ఆయ‌న దిశ‌తో మాట్లాడారు. నూతన సంవత్సరం వేడుకలను ఆనందంగా, చట్టానికి లోబడి జరుపుకోవాలని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31 సందర్భంగా కామారెడ్డి పట్టణ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల పేరిట డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు వినియోగించినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే, వాహనం నడిపిన మైనర్‌తో పాటు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవిస్తూ, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలగకుండా, సురక్షితంగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాలని సూచించారు.

Next Story