- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొక్కజొన్న రైతుల పొట్ట కొట్టకండి.. మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి
ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించిన నగదును తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ,తాడ్వాయి: ప్రభుత్వం సేకరించిన మొక్కజొన్న పంటకు సంబంధించిన నగదును తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించి నెలలు గడుస్తున్నా,నేటికీ వారి ఖాతాల్లో పూర్తిగా జమ కాకపోవడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరక, తదుపరి పంటలకు పెట్టుబడి లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని రైతులు అధికారులను అడిగితే, రేపు.. మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని కపిల్ రెడ్డి మండిపడ్డారు.ఈ తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని ఆయన ఆరోపించారు. రైతుల కష్టాన్ని గుర్తించి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. పెండింగ్‌లో ఉన్న మొక్కజొన్న బకాయిలను వడ్డీతో సహా రైతుల ఖాతాల్లో జమ చేయాలని,కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించి, వారిని అప్పుల ఊబిలోకి నెడుతోంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడి తక్షణమే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి.ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేయకపోతే రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని కపిల్ రెడ్డి హెచ్చరించారు.






