- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదర్శ పాఠశాల ఆటస్థలం అభివృద్ధి కోసం విరాళం
దిశ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని గోపాల్ పేట్ తెలంగాణ ఆదర్శ పాఠశాల ఆట స్థలం అభివృద్ధి కోసం మండలంలోని కన్నారెడ్డి గ్రామానికి చెందిన

దిశ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని గోపాల్ పేట్ తెలంగాణ ఆదర్శ పాఠశాల ఆట స్థలం అభివృద్ధి కోసం మండలంలోని కన్నారెడ్డి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పేరుపల్లి సాయిబాబా రూ.25వేలు విరాళాలు అందజేసినట్టు పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు. ఆదర్శ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు అనువైన ఆట స్థలం లేకపోవడంతో, టిప్పర్లతో మరో మట్టి వేయించి జెసిబి తో చదివి చేయించి విద్యార్థుల కోసం ఆట స్థలాన్ని సాయిబాబా అభివృద్ధి చేయించినట్లు తెలిపారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న ఆరవ తరగతి నుండి ఇంటర్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వరకు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు టాపర్ విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైన బహుమతులు అందిస్తామని సాయిబాబా ప్రకటించినట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థుని విద్యార్థులు ఉత్తమ లక్ష్యంతో చదివి, పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సాయిబాబా కోరారు. పాఠశాలకు 25 వేల రూపాయల ఖర్చుతో ఆటస్థలం అభివృద్ధి చేసిన సందర్భంగా సాయి బాబాను పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్నా రెడ్డి సర్పంచ్ సాయిలు, నాయకులు దుర్గేష్, వెంకటేష్, మహేందర్, బాలకృష్ణ, నాగరాజు, లక్ష్మీనారాయణ, రమేష్, గోపి, పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






