- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ కొత్త సీపీ ఎవరో తెలుసా..?
by Naveena |
కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీపీ రాక కరారైంది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సీపీ రాక కరారైంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య 2016 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి రానున్నారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో ఎస్ పీ గా పని చేస్తున్న ఆయనను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఇంతకు ముందు నిజామాబాద్ సీపీగా పని చేసిన కల్మేశ్వర్ సింగెనవార్ బదిలీపై వెళ్లిన తరువాత ఎవరినీ ఇక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూ శర్మ ఇంచార్జి సీపీగా కొనసాగారు. తాజాగా నిజామాబాద్ కు కొత్త సీపీ రానుండటంతో లా అండ్ ఆర్డర్ ట్రాక్ లో పడే అవకాశాలున్నాయి. దొంగతనాలు, ఇసుక,మొరం అక్రమ రవాణా, పేకాట, గంజాయి రవాణా వంటి నేరాలు నియంత్రణలోకి వచ్చే అవకాశాలున్నాయి.
Next Story






