- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : ఎస్పీ రాజేష్ చంద్ర
దిశ, భిక్కనూరు : మద్యం సేవించి వాహనాలను నడపొద్దని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు హై

దిశ, భిక్కనూరు : మద్యం సేవించి వాహనాలను నడపొద్దని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు హైవేపై అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు 44వ హైవేపై వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి నుంచి 12 గంటలకు ప్రారంభమైన ఈ తనిఖీలు శుక్రవారం వేకువ జామున 4 గంటల వరకు రోడ్డు కిరువైపులా కొనసాగాయి. సీఐ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో 8 బృందాలుగా ఏర్పడి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 1139 వాహనాలను తనిఖీ చేయగా.. 27 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి అకోలో వెళుతున్న ప్రైవేట్ బస్సు తోపాటు, రెండు డీసీఎం వ్యాన్లు, పది కార్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు పంపించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, మీ నిర్లక్ష్యం మీ ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమన్నారు. వాహనాల ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే కటకటాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు, దోమకొండ, బీబీపేట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






