- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ స్తంభాలకు మూడు రంగుల విద్యుత్ బల్బుల వితరణ
మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విట్టల్ రెడ్డి విఠల్ రెడ్డి రూ.30 వేలు విలువైన మూడు రంగుల విద్యుత్ బల్బులను శుక్రవారం వితరణ చేసి ప్రారంభించారు.

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు విట్టల్ రెడ్డి విఠల్ రెడ్డి రూ.30 వేలు విలువైన మూడు రంగుల విద్యుత్ బల్బులను శుక్రవారం వితరణ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలోని వీధి స్తంభాలకు జాతీయ జెండా రంగులు కలిగిన విద్యుత్ బల్బులను ఏర్పాటు చేయించినట్టు తెలిపారు. వీధి స్తంభాలకు ఏర్పాటుచేసిన మూడు రంగుల విద్యుత్ బల్బులను విట్టల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మన్నే వెంకట్, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులతో కలిసి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి ని గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొల్లు నర్సింహ రెడ్డి, విఠల్ రెడ్డి కిషన్ రెడ్డి, కిచ్చయ నారాయణ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మురళిగౌడ్, గోపాల్ పేట్ సర్పంచ్ వంశీ కృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ లు బాలాజీ, గులాం హుస్సేన్, పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






