క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీ

by Ratna Kumari |

దిశ‌, ఆలూర్ : మండల కేంద్రంలో గురువారం క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కల్లెడి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెక్కులను అందజేశారు.

క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్ చెక్కుల పంపిణీ
X

దిశ‌, ఆలూర్ : మండల కేంద్రంలో గురువారం క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. కల్లెడి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం తీసుకుంటున్న పథకాలు సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి న్యాయం చేయడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్, తహసీల్దార్ రమేష్, ఆర్ ఐ రేణుక,బీజేపీ మండల అధ్యక్షులు సూర శ్రీకాంత్,ఉపాధ్యక్షుడు డాక్టర్ అరుణ్, గంగోల్ల ప్రళయ్ తేజ్, బీజేపీ మండల అధ్యక్షులు సూర శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు డాక్టర్ అరుణ్, గంగోల్ల ప్రళయ్ తేజ్, మ‌ల్ల‌య్య‌, బండారి యాదగిరి, సుభాష్, నవీన్, అర్జిత్, పోశెట్టి సురేష్ గౌడ్, శివ కేశవులు పాల్గొన్నారు.

Next Story