కల్లడి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం కల్లడి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న సూక్కి మీనా, వసీమ బేగం ఇటీవల తీవ్ర అనారోగ్యంతో

కల్లడి లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం కల్లడి గ్రామానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న సూక్కి మీనా, వసీమ బేగం ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి పరిస్థితిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం డేగ పోశెట్టి ఆధ్వర్యంలో సూక్కి మీనా కు రూ.33,000, వసీమ బేగంకు రూ.18,000, చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు డేగ పోశెట్టి, గ్రామ శాఖ అధ్యక్షులు నీలగిరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, ఆలూరు మండల యూత్ ప్రెసిడెంట్ సిరికొండ మహేష్, ధర్మయ్య అశోక్, హబీబ్, నర్సారెడ్డి, శ్రీను గంగారాం, భాస్కర్, బాలరాజు, శివ కృష్ణ, రాజశేఖర్, యోహాన్ పాల్గొన్నారు.

Next Story