- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ ఎఫెక్ట్.. హైవేపై రాంగ్ రూట్ లో వెళ్తున్న టిప్పర్ ట్రాలీ సీజ్
దిశ, భిక్కనూరు : జాతీయ రహదారి 44 పై రాంగ్ రూట్ లో వెళ్తున్న టిప్పర్ ట్రాలీని కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు. అంతంపల్లి వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ లో

దిశ, భిక్కనూరు : జాతీయ రహదారి 44 పై రాంగ్ రూట్ లో వెళ్తున్న టిప్పర్ ట్రాలీని కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీసులు ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు. అంతంపల్లి వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ లో డీజిల్ పోసుకొని, రాంగ్ రూట్లో ప్రమాద కరంగా వెళుతున్న గుజరాత్ కు చెందిన టిప్పర్ ట్రాలీ ని పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు గుర్తించి టిప్పర్ ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతేకాకుండా డ్రైవర్ పై కేసు కూడా నమోదు చేశారు. నాలుగు రోజుల క్రితం" దిశ " జిల్లా టాబ్లైడ్ పేజీలో "హైవేపై ఆపద అనే శీర్షికన వచ్చిన వార్త కథనానికి పోలీస్ శాఖ స్పందించి, రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాలపై కొరడా జూలిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆంజనేయులు "దిశ"తో మాట్లాడుతూ పక్షం రోజుల క్రితం రాంగ్ రూట్లో వచ్చిన ఇసుక టిప్పర్ ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొనగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనాలపై నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్ చేస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.






