- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > దిశ ఎఫెక్ట్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్, కామారెడ్డి ఎమ్మెల్యే
దిశ ఎఫెక్ట్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించిన అదనపు కలెక్టర్, కామారెడ్డి ఎమ్మెల్యే
by Bhanu |
"దిశ" దినపత్రికలో బుధవారం ప్రచురితమైన "కళ్లాల్లోనే ధాన్యం" కథనానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కామారెడ్డి ఎమ్మెల్యే స్పందించారు.

X
దిశ, కామారెడ్డి : "దిశ" దినపత్రికలో బుధవారం ప్రచురితమైన "కళ్లాల్లోనే ధాన్యం" కథనానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, కామారెడ్డి ఎమ్మెల్యే స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ విక్టర్ లింగంపేట్ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి, అడ్లూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వర్షానికి తడిచి పోయిన వడ్ల బస్తాలు, ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, నింపిన బస్తాలు వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. లారీలు సక్రమంగా కేంద్రాలను వచ్చేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
Next Story






