దిశ ఎఫెక్ట్.. అంగ‌న్ వాడి టీచ‌ర్ ని తొల‌గింపు

by Ratna Kumari |   (  Updated:2025-10-15 13:27:23  IST  )

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : అమ్మ‌కానికి అంగ‌న్ వాడీ గుడ్లు అనే క‌థ‌నం అక్టోబ‌ర్ 13న దిశ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌నం పై ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్ అయింది. ఈ

దిశ ఎఫెక్ట్.. అంగ‌న్ వాడి టీచ‌ర్ ని తొల‌గింపు
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : అమ్మ‌కానికి అంగ‌న్ వాడీ గుడ్లు అనే క‌థ‌నం అక్టోబ‌ర్ 13న దిశ దిన‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన విష‌యం తెలిసిందే. ఈ క‌థ‌నం పై ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్ అయింది. ఈ నేపథ్యంలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథక అధికారిణి స్వర్ణలత విచారణ చేప‌ట్టారు. విచారణలో మండల కేంద్రానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ బాలమణి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. G.O.Ms.No.14, తేదీ 23.05.2015 ప్రకారం ఆమెను అంగన్‌వాడీ విధుల నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు సమర్పించారు. అయితే జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ విషయం పై జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ భీ అక్టోబర్ 14న నివేదికను సమర్పించారు. ఈ విచారణలో నిర్ధారాణమైన అంశాలపై జిల్లా పరిపాలన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం పిల్లల పోషణ కోసం అందించే ఆహార పదార్థాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడం తీవ్ర నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

Next Story