వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

by Nallavelli.Anjaneyulu |

దిశ , నాగిరెడ్డిపేట్ : వ్య‌క్తి అదృశ్య‌మైన ఘ‌ట‌న నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గ‌వ్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని వాడి గ్రామానికి

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : వ్య‌క్తి అదృశ్య‌మైన ఘ‌ట‌న నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గ‌వ్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల ప‌రిధిలోని వాడి గ్రామానికి చెందిన బాసారం నాగరాజు (26) గత 8 నెలల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి రాత్రిపూట వెళ్లిపోయాడు. నాగరాజు భార్య బాసారం జయలక్ష్మి గత మే నెల 29వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందన్నారు. జయలక్ష్మి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాడన్నారు. కాగా నాగరాజు కుటుంబ సభ్యులు తమ బందు మిత్రుల దగ్గర అన్నిచోట్ల వెతికినా నాగరాజు ఆచూకీ లభించడలేదన్నారు. జయలక్ష్మి తన భర్త ఎన్నటికైనా తిరిగి వస్తాడనే ఆశతో ఎదురుచూసిందని, రెండు నెలలు గడిచిన తన భర్త తిరిగి ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో భర్త మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అదృశ్యమైన బాసారం నాగరాజు తెలుపు రంగులో ఐదు అడుగుల 2 అంగుళాల ఎత్తు ఉంటాడని, ఇంట్లో నుండి వెళ్లిపోయే సమయంలో తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. నాగరాజు ఆచూకీ తెలిసినవారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 8712686161 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై తెలిపారు.

Next Story