- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాన్సువాడలో విద్యుత్ కార్మికుల ధర్నా..!
బాన్సువాడ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్‌డ్ పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

దిశ, బాన్సువాడ : బాన్సువాడ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిసన్, అన్‌మ్యాన్‌డ్ పీస్ రేటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వెలిబుచ్చారు. తమకు రావాల్సిన వేతనాలు, ఇతర సౌకర్యాలను వెంటనే కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ శ్రమకు తగ్గ గుర్తింపు లభించడం లేదని, అనేక సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
30 రోజుల పనికి 30 రోజిలవేతనం ఇవ్వాలి
గతంలో ఏపీఏఎస్ ఈబీ లాగే ఎన్.పీ డీసీఎల్ లో వేతనాలు చెల్లించాలి. పని భారం తగ్గించాలి. మ్యాన్ పవర్ పెంచాలి. సాలరీ పీఆర్ సీ పెంచాలి. పీస్ రేట్ తీసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. జి.ఓ. నెంబర్ 11ప్రకారం వేతనాలు చెల్లించాలంటూ పలు డిమాండ్లతో బాన్సువాడ, బిచ్కుంద ఉమ్మడి డివిజన్ కు చెందిన ఆర్టిజేన్,పీస్ రేట్, అన్‌మ్యాన్‌డ్ కార్మికులు 170 వరకు ధర్నాలో పాల్గొన్నట్లు జిల్లా అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి సమీ,శివకుమార్,వినోద్,సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.






