- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్మల్ మున్సిపాలిటీకి మంచి రోజులు
నిర్మల్ జిల్లా కేంద్ర పురపాలక సంఘం అభివృద్ధి పథంలో పయనించనున్నది. దీర్ఘకాలంగా పట్టణ ప్రజలు మనిషినీటి సరఫరా, మురుగునీటి

దిశ, ప్రతినిధి నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్ర పురపాలక సంఘం అభివృద్ధి పథంలో పయనించనున్నది. దీర్ఘకాలంగా పట్టణ ప్రజలు మనిషినీటి సరఫరా, మురుగునీటి సమస్య కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక విజ్ఞప్తులు వెళ్లినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. కానీ తాజాగా ప్రభుత్వం ఈ పనుల కోసం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంతోపాటు మంచినీటి సరఫరాకు సంబంధించి సుమారు రూ.57కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.42కోట్లు మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. కొన్ని దశాబ్దాలుగా నిర్మల్ పట్టణంలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణపై ప్రజల్లో అసహనం ఉంది. అలాగే పట్టణంలోని కొన్ని గుట్ట ప్రాంతాలతోపాటు కొత్తగా ఏర్పాటు అయిన కాలనీలకు తాగునీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. తాజా నిధుల మంజూరుతో ప్రధాన సమస్యలు తీరనున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్ర పురపాలక సంఘం అభివృద్ధి పథంలో పయనించనున్నది. దీర్ఘకాలంగా పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్న మనిషినీటి సరఫరా, మురుగునీటి సమస్య కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక విజ్ఞప్తులు వెళ్లినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. కానీ తాజాగా ప్రభుత్వం ఈ పనుల కోసం నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.
మురుగునీటి శుద్ధి.. మంచినీరు..
నిర్మల్ జిల్లా కేంద్రంలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణంతోపాటు మంచినీటి సరఫరాకు సంబంధించి సుమారు రూ.57కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.42కోట్లు మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణాలను చేపట్టాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 15కోట్లతో మంచినీటి సరఫరా, అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఉత్తర్వులను నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. ఇందుకు సంబంధించి సత్వరమే ప్రణాళికలు తయారుచేసి పనులు కూడా ప్రారంభించాలని ఆదేశాలు అందాయి. కొన్ని దశాబ్దాలుగా నిర్మల్ పట్టణంలో మురుగునీటి వ్యవస్థ నిర్వహణపై ప్రజల్లో అసహనం ఉంది. అలాగే పట్టణంలోని కొన్ని గుట్ట ప్రాంతాలతోపాటు కొత్తగా ఏర్పాటు అయిన కాలనీలకు తాగునీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. తాజా నిధుల మంజూరుతో ప్రధాన సమస్యలు తీరనున్నాయి






