- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.8.90 కోట్లతో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి : ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 8 కోట్ల 90 లక్షలతో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు మంజూరైనట్టు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

దిశ, కామారెడ్డి టౌన్ : కామారెడ్డిని క్రీడల హబ్‌గా తీర్చిదిద్దేందుకు రూ. 8 కోట్ల 90 లక్షలతో ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులకు మంజూరైనట్టు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధి పనులను, ప్రతిపాదిత ఇండోర్ స్టేడియం స్థలాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ శనివారం అధికారులతో కలిసి పరిశీలించి పనులను ప్రారంభించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ. 8 కోట్ల 90 లక్షలను కేటాయించిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కామారెడ్డి క్రీడా రంగంలో విశిష్ట స్థానం సంపాదించనుందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాల రన్నింగ్ ట్రాక్,ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, విశాలమైన గ్యాలరీలు, అత్యాధునిక ఇండోర్ స్టేడియం, ఆధునిక జిమ్, రైఫిల్ షూటింగ్ రేంజ్, వాలీబాల్ కోర్టు,టెన్నిస్ కోర్టు, టేబుల్ టెన్నిస్ సదుపాయాలు, ముఖ్యమంత్రితో చర్చించి భవిష్యత్తులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని కూడా చేపడతామని షబ్బీర్ అలీ తెలిపారు. ఇందిరాగాంధీ స్టేడియం రూపురేఖలు మారనున్నాయి అనడంతో స్థానిక క్రీడాకారులు, యువత, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, భీమ్ రెడ్డి, నౌసిలాల్, పాత రాజు, లక్ష్మీ రాజా గౌడ్, ఐరేనీ సందీప్, కారంగుల అశోక్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.






