కార్మికులను నిలువు దోపిడి చేస్తున్న దేశాయ్ యాజమాన్యానికి బుద్ధి చెబుతాం : TUCI

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న దేశాయ్ యాజమాన్యంకు బుద్ధి చెబుతామ‌ని అని తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా ప్రధాన

కార్మికులను నిలువు దోపిడి చేస్తున్న దేశాయ్ యాజమాన్యానికి బుద్ధి చెబుతాం : TUCI
X

దిశ, ఆర్మూర్ : కార్మికులను నిలువు దోపిడీ చేస్తున్న దేశాయ్ యాజమాన్యంకు బుద్ధి చెబుతామ‌ని అని తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ (TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ అన్నారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్ నుండి దేశాయ్ బ్రదర్స్ రీజినల్ కార్యాలయంను ముట్టడించారు. కార్మికుల ముట్టడి చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్n(TUCI) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడారు. బీడీ కార్మికుల వద్ద రోజు వారిగా అజర్ కు10రూ.చో. సంవత్సరంకు 210 కోట్ల డబ్బుల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ముడిసరుకులు అందించే విషయంలో కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. వేయి బీడీలకు నాసిరకం ఆకువల్ల కార్మికులు తుట్టి లింపి ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఏ రంగంలో లేని విధంగా బీడీ రంగంలోనే పక్కపడ్డ మూడు సరుకులు బీడీ కార్మికులకు యాజమాన్యం అంటగట్టడం భావ్యం కాదన్నారు.

కార్మికులను దోచుకోవడం లక్ష్యంగా పెట్టుకుని యజమాన్యం వ్యవహరిస్తుందన్నారు. దీనికి తోడుగా బీడీ కార్మికులకు బలవంతంగా పితారా పేరుతో నాసిరకం తిను బండారాలను అంటగట్టి ఇల్లీగల్ వ్యాపారం చేస్తుందన్నారు.యాజమాన్యం అందించే తునికి ఆకు అసలు ముక్కిపోయి, ఖరాబ్ అయినది వేయడం వల్ల కార్మికులు చాలా నష్టపోతున్నారని అన్నారు. తమ దోపిడిని కప్పి పెట్టుకోవడానికి యజమాన్యం ఆందోళనలు చేయకుండా కార్మికులను బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే యాజమాన్యం తమ దోపిడీ పద్ధతిని మార్చుకోకుంటే ఆయా గ్రామాల్లో ఎక్కడికి అక్కడ బుద్ది చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎల్)మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, తెలంగాణ ప్రగతిశీల భీడివర్కర్స్ యూనియన్ (TUCI) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు ఎం. ముత్తేన్న, ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు వి. సత్తేవ్వ, కె. రాజేశ్వర్, ఎ. ప్రకాష్, కార్యదర్శి ఎం. అనిస్, కోశాధికారి అరవింద్, నాయకులు ఎండి.నశిర్, టీ.శ్రీను , సీపీఐ(ఎం. ఎల్) మాస్ లైన్ నాయకులు బి. కిషన్, ఆర్. దామోదర్, పి. రమ, ఆర్. పుష్పలత, జి పద్మ, ఎ.లక్ష్మి, ఎస్.సునీత పాల్గొన్నారు.

Next Story