చిన్నారుల్లో లోపాల‌ను ప్రారంభంలోనే గుర్తించాలి : క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్

by Nallavelli.Anjaneyulu |

చిన్నారుల్లో లోపాల‌ను ప్రారంభంలోనే గుర్తించాలని క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.

చిన్నారుల్లో లోపాల‌ను ప్రారంభంలోనే గుర్తించాలి :  క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ, కామారెడ్డి టౌన్ : చిన్నారుల్లో లోపాల‌ను ప్రారంభంలోనే గుర్తించాలని క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ-పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ-RBSK సంయుక్తంగా నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ 0-5 ఏళ్లలోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి వైద్య సేవలు అందిస్తే సాధారణ స్థితికి తీసుకురావచ్చన్నారు. జిల్లాలోని 13 ఆర్బీఎస్కే బృందాలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి, 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు పరీక్షలు నిర్వహించాయి. మొదటి రోజు 31 మంది చిన్నారులకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రమీల, డీఎంహెచ్ఓ రవీందర్, ఆర్డీవో ఎన్‌వి గిరి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రావ్, ఆర్ బి ఎస్ కే వైద్యులు, సీడీపీఓలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Next Story