రాజంపేట మండలంలో దారుణం.. ఆస్తి కోసం కన్న తండ్రిని దహనం చేసిన కూతుళ్లు

by Disha Web Desk 12 |
రాజంపేట మండలంలో దారుణం.. ఆస్తి కోసం కన్న తండ్రిని దహనం చేసిన కూతుళ్లు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటు చేసుకుంది.చివరి శ్వాస వరకు గంజి పోస్తారు అనుకున్న కూతుళ్లే యమపాశంగా మారి తండ్రిని ఇంట్లోనే బంధించి దహనం చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన కొప్పుల ఆంజనేయులు(70) అనే అతనికి ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు గత కొన్ని రోజుల క్రితమే తన వ్యవసాయ పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు కూతుళ్లకు పెండ్లిలు సైతం చేశాడు. మొదటి భార్య కూతుర్లు సరిగ్గా చూసుకోక పోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు.

రెండో భార్యతో సహ జీవనం చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి ఆయనతో కూతురు ఆస్తి కోసం తండ్రితో గొడవలు చేస్తున్నారు. ఆదివారం చిన్న కూతురు బిడ్డ పెండ్లి విందు కార్యక్రమం కామారెడ్డిలో జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నుండే తండ్రికి ఇంట్లో తాళం పెట్టి ఉంచి విందుకు వెళ్లారు కూతుర్లు. ఈ విందు ఎక్కడ ఆగిపోతుందోనని ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలుస్తోంది.

ఆదివారం రాత్రి కన్న తండ్రిని చంపేసి పెట్రోల్ పోసి దహనం చేశారు. చనిపోతున్న కాపాడండి మంటలు అంటుకున్నాయి చనిపోతున్నా అని ఆంజనేయులు మొత్తుకున్న శబ్దాలుకు చుట్టుపక్కల వారు వెళ్లిన కూతుర్లు దగ్గరకు రానీయకుండా అడ్డుపడ్డారు అని గ్రామస్తులు పేర్కొంటున్నారు . ముందే ప్రణాళిక ప్రకారం తండ్రిని సజీవ దానం చేసి ఆస్తిని కాజేయాలని ఈ కుట్రకు తెరలెపినట్టు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ఇంటిని కూల్చారు. మాంసపు ముద్దలో పడి ఉన్న ఆంజనేయులు శవాన్ని బయటకు తీశారు. తల, మొండెం విడిపోయినట్లు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కామారెడ్డికి తరలించారు. ఆ రాత్రికి రాత్రే మాంసం ముద్దలను పోస్టుమార్టం తరలించడానికి కారణమేంటి? ఆ రాత్రి పోలీసులు జేసీబీ సహాయంతో హల్చల్ చేయాల్సిన అవసరం ఏముందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న కుల పెద్దలు, గ్రామస్తులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నిందితులతో ఎస్సై కుమ్మక్కయ్యారని, కులస్తులు, గ్రామస్తులు ఆరోపణ చేస్తున్నారు. పక్కా ప్లాన్ తోనే దహనం చేశారని, ఇంట్లోనే బంధించిన కూతుర్లు, మనవడే ఈ పని చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.


Next Story