అంబులెన్స్ లో క్రిటిక‌ల్ డెలివ‌రీ

by Ratna Kumari |

108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు.

అంబులెన్స్ లో క్రిటిక‌ల్ డెలివ‌రీ
X

దిశ, తాడ్వాయి : 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన సౌమ్యకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌ను ఆశ్రయించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా.. తాడ్వాయి మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమయ్యాయి.​ శిశువు మెడలో పేగు చుట్టుకొని పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ,ఈఆర్పీ డాక్టర్ కాశిరెడ్డి ఫోన్ సూచనల మేరకు ఈఎంటీ డి. సత్యం, పైలట్ శ్రావణ్ చాకచక్యంగా అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. సౌమ్య 2.8 కేజీల మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ కామారెడ్డి జీజీహెచ్‌లో క్షేమంగా ఉన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు నిలిపిన 108 సిబ్బందిని స్థానికులు అభినందించారు.

Next Story