ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి

by Ratna Kumari |

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి
X

దిశ, కామారెడ్డి : నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి మున్సిపాలిటీ లోని 7, 8, 27 వార్డుల్లో సీపీఎం పోటీ చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అనేక హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఓటు వేసిన వారికి ముఖం కూడా చూపించకుండా తమ స్వలాభాల కోసం వ్యాపారాలు, కబ్జాలు, సెటిల్మెంట్ ల కోసం తిరిగే నాయకులకు ఓటు వేయవద్దని కోరారు. ప్రజల కోసం కొట్లాడుతూ తప్పుడు కేసులు మీదేసుకొని లాఠీ దెబ్బలు తిని జైలుకెళ్ళి తిరిగి మళ్లీ ప్రజల కోసం కొట్లాడుతున్న సీపీఎం అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతిరామ్ నాయక్, కొత్త నరసింహులు పాల్గొన్నారు.

Next Story